News – SEVA https://www.sevalive.com On Live Magazine Thu, 30 Apr 2026 02:22:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.sevalive.com/wp-content/uploads/2026/04/cropped-sevalive-logo-round-32x32.png News – SEVA https://www.sevalive.com 32 32 జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి! https://www.sevalive.com/jihwako-ruchi/ https://www.sevalive.com/jihwako-ruchi/#respond Wed, 12 Feb 2025 05:45:54 +0000 https://sevalive.com/?p=217 జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!
– డా. పి. వి. ఎల్. సుబ్బారావు

కూటి కొరకే కోటి విద్యలు!

మనిషినిత్యావసరాలు మూడే!

కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే!

అన్నమేరోజూ తింటూఉంటాం!

ఏ రోజు కారోజు,
కొత్తదనమే కోరుకుంటాం!

కవిత్వానికి సైతం ,
ఇంపైన భోజనమే ప్రీతి!

రుచుల తృప్తి,
కవిత్వ అభివృద్ధిలో దీప్తి!

ఆరు రుచులు ఉన్నా,
వాటిలో దేనికదే సాటి!

ఎవరి ఇష్టాన్ని బట్టి ,
వారి కదే మేటి!

రుచుల సమతుల్య దృష్టి,
తిన్నది ఇస్తుంది పుష్టి!

యుక్త ఆహార విహారాలు, ఉండాలి అని అన్నారు!

శరీరానికి యుక్తమైన,
మిత ఆహారం అవసరం!

ఆహారంతో ఆరోగ్యం,
కాపాడుకోవడమే వివేకం?

వయసును బట్టి ఆహారం స్వీకరించడం అత్యవసరం!

తీసుకున్న ఆహారం,
కారాదు ఏనాడు రోగకారకం!

తీపి శుభం బహుజన ప్రీతి!

కారం తీపికి తోడు ఈ జగతి!

చేదు ఆరోగ్యానికి సరిశృతి!

పులుపు వలపు బహుమతి!

ఉప్పే లేకుంటే పోతుంది మతి!

షడ్రుచుల సంగమం ,
ఉగాది పచ్చడి!

జీవితం షడ్రసోపేత ,
వడ్డించిన విస్తరి!

మనలోని వైశ్వానరుడే,
మనం తినే ఆహార జీర్ణకారి!

ఆరు ఋతువుల,
ఆవర్తనం నిజ ప్రకృతి!

మానవ అభిరుచుల,
సరి సుందర ఆకృతి!

  • డా. పి. వి. ఎల్. సుబ్బారావు,
    విజయనగరం.
0Shares
]]>
https://www.sevalive.com/jihwako-ruchi/feed/ 0
శాసనసభ https://www.sevalive.com/saasanasabha-kamaladrevi/ https://www.sevalive.com/saasanasabha-kamaladrevi/#respond Sat, 08 Feb 2025 12:43:17 +0000 https://sevalive.com/?p=209 డా. భమిడిమల్లి కమలాదేవి నానీలు

శాసనసభ

1.
విసిరిన మైకులు
విరిగిన కుర్చీలు
శాసనసభే
కార్యం శూన్యం
2.
పెట్టుకుంది
శాసనసభ
నవజంట
ఉండాలావిడిపోవాలా
3.
నడుస్తోంది
ప్రకృతిశాసనసభ
భవితగురించి
చర్చలు
4
గిన్నెల చప్పుళ్లతో
నడుస్తోంది
శాసనసభ
ఇల్లాలేస్పీకరు
5.
ఓట్ల బేరీజులే
శాసనసభల్లో
యోచన
ఓట్లబేరానికి

డా. భమిడిమల్లి కమలాదేవి

0Shares
]]>
https://www.sevalive.com/saasanasabha-kamaladrevi/feed/ 0
హిందుత్వం-భారతీయం https://www.sevalive.com/sreenaaraa-naaneelu/ https://www.sevalive.com/sreenaaraa-naaneelu/#respond Sat, 08 Feb 2025 12:32:35 +0000 https://sevalive.com/?p=206 ‘శ్రీనారా’ నానీలు

హిందుత్వం – భారతీయం


హిందుత్వమంటే
అందరికీ మంటే
అది ధర్మనిరపేక్షణం
సర్వ సామాన్యం. .. ౧

హిందుత్వం
ఉదారవాదిత్వం
సహిష్ణుతత్వం
స్వాభావిక నియతి. .. ౨

హిందుత్వం
ఉక్తుల పర్యాయ వాచకం
ప్రకృతి ధర్మం
ప్రాకృతిక జీవనం. .. ..౩

బహు సంస్కృతీ వాదం
సార్వభౌమికత్వం
జాతి ఏకీకృతం
భారతీకరణం. .. .. .. .. ౪

జాతీయ అవధారణం
ధర్మ రాజ్యం
ఏకాత్మ మానవత్వం
శాశ్వత సందేశం. .. .. ౫

భారతీజ్ఞాన ప్రణాళీ
శాశ్వతం
మానవత్వ వాస్తవిక జ్ఞాన
పూర్ణత్వం. … … … ౬

సంవాద పరంపర
పున: ప్రతిష్ఠ
భారతీయ జీవత్వ
అభినివేశం. … … ౭*

శ్రీపెరంబుదూరు నారాయణ రావు,
‘శ్రీనారా’
హైదరాబాద్.

0Shares
]]>
https://www.sevalive.com/sreenaaraa-naaneelu/feed/ 0
డొక్కా సీతమ్మ పేరు పవన్ కళ్యాణ్ సూచించారు. https://www.sevalive.com/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/ https://www.sevalive.com/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/#respond Fri, 09 Aug 2024 07:44:04 +0000 https://sevalive.com/?p=160 డొక్కా సీతమ్మ .. ఈ పేరు ఏపీలో చాలా మందికి తెలియని పేరు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ అపర అన్నపూర్ణ పేరు అందరికీ చిర పరిచయం అయ్యింది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ లు పెట్టాలని మొదట పవన్ కళ్యాణ్ భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో కూడా చర్చించినట్టు సమాచారం.


ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ లు ఆగస్ట్ 15 నుండి ప్రారంభం అయితే తాజాగా ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే కాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నా కాంటీన్లు అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ గారి పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.


డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో కాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చని ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేశారు .డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
స్కూల్ లో డొక్కా సీతమ్మ గురించి చదివిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని మా నాన్నగారు తనకు ఇచ్చారని, అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని, ఆకలి అన్న వారికి అర్థరాత్రి వేళ కూడా వండివార్చి పెట్టేవారనీ చదివానన్నారు.

అందరి ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అంతర్వేది దర్శనానికి బయలుదేరితే… దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను. ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ గారి దాతృత్వ భావనలు గుర్తుకు వస్తూనే ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలన్న ప్రతిపాదన స్కూలు విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఉండటం వల్ల భావి తరాలకు విలువలు అందించగలమన్నారు. అలాగే పేదలకు కిలో రూ.2 కు బియ్యం అందించే పథకం తీసుకువచ్చిన ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా కాంటీన్లు నిర్వహణ సముచితమన్నారు. అందుకే డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టారు.

0Shares
]]>
https://www.sevalive.com/%e0%b0%a1%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95/feed/ 0
కీలక పదవుల నియామకం https://www.sevalive.com/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/ https://www.sevalive.com/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/#respond Wed, 07 Aug 2024 07:28:43 +0000 https://sevalive.com/?p=119 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెండింగ్ పదవుల నియామకం పైన కసరత్తు చేస్తోంది. టీటీడీ తో సహా అన్ని కీలక పదవుల పైన చంద్రబాబు - పవన్ చర్చలు చేసారు. ప్రాధమికంగా కొన్ని పదవుల పైన నిర్ణయానికి వచ్చారు. టీటీడీ ఛైర్మన్ గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడు పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తో పాటుగా చీఫ్ విప్...జనసేన, బీజేపీ విప్ ల నియామకం పైన తుది నిర్ణయం తీసుకున్నారు.

డిప్యూటీ స్పీకర్ గా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉండటంతో…డిప్యూటీ స్పీకర్ గా రాయల సీమ ప్రాంతానికి చెందిన బీసీ నేత కాల్వ శ్రీనివాసుల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, సవిత స్థానం దక్కించుకున్నారు. దీంతో, సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చీఫ్ విప్ గా జీవీ

అసెంబ్లీలో కూటమికి 164 సభ్యుల సంఖ్యా బలం ఉంది. అదే విధంగా టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో చీఫ్ విప్ పదవి ఆ పార్టీకే దక్కనుంది. ఈ పదవి తొలి నుంచి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే, పల్నాడు జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ ప్రాంతానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను చీఫ్ విప్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా మూడు పార్టీల నుంచి 14 మంది విప్ లను నియమించనున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నుంచి
జనసేన నుంచి ఇప్పటికే నలుగురి పేర్లను పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు సిఫార్సు చేసారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్ గా లోకం మాధవిని నియమించనున్నారు. అదే విధంగా జనసేన నుంచి మరో ఇద్దరు విప్ లుగా నియమితులు కానున్నారు. బీజేపీ నుంచి చీఫ్ విప్ గా సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణు కుమార్ రాజు నియమితులయ్యారు. అదే విధంగా టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

0Shares
]]>
https://www.sevalive.com/%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95%e0%b0%82/feed/ 0
టీటీడీ ఛైర్మన్ గా బి. ఆర్. నాయుడు? https://www.sevalive.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80-%e0%b0%9b%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%97%e0%b0%be-%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8/ https://www.sevalive.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80-%e0%b0%9b%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%97%e0%b0%be-%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8/#respond Wed, 07 Aug 2024 07:10:40 +0000 https://sevalive.com/?p=112 టీటీడీ ఛైర్మన్ గా బి. ఆర్. నాయుడు?

     ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు  ఛైర్మన్ ఎంపిక పై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది.  కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఛైర్మన్ పదవితో పాటుగా బోర్డు సభ్యులుగా పలువరు ప్రయత్నాలు చేసారు. అయితే, మీడియా సంస్థ    టీవీ 5  అధినేత  బి. ఆర్. నాయుడును  టీటీడీ  బోర్డు ఛైర్మన్ గా ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

  రెండు నెలల కాలంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఎంపిక పైక కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి రావటంతో పలువురు ప్రముఖులు ఈ పోస్టు కోసం పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాలు. అనుభవం పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పైన చర్చ జరిగింది. అయితే, ఆ తరువాత ఆయనకు అవకాశం లేదని తేల్చారు.
తాజాగా టీవీ 5 సంస్థల అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా  చంద్రబాబు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న మరో సీనియర్ నేత పేరు పైన చర్చ జరిగింది. ఇటీవల జేఈవో వెంకయ్య చౌదరిని నియమించిన సందర్భంలో కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్లు విమర్శలు వచ్చిన నేపథ్యంలో   బి. ఆర్. నాయుడుకు ఇవ్వడంలో చంద్రబాబు ఆలోచనలో పడ్డారని తెలిసింది.   
     అయితే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా  టీడీపీకి మద్దతుగా నిలిచిన  మీడియా సంస్థ  అధినేత బి. ఆర్. నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 

టీటీడీ నూతన పాలకవర్గం అదే విధంగా టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల నేతలకు ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులను నియమించనన్నారు. ఇందులో బీజేపీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. జనసేన నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖుడి పేరు బోర్డు సభ్యుల జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించనునున్నట్లు సమాచారం.

0Shares
]]>
https://www.sevalive.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80-%e0%b0%9b%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%97%e0%b0%be-%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8/feed/ 0