AndhrapradeshNews

తిరుమల భక్తులకు టీటీడీ కీలక సూచన!

      
 తిరుమలకు వచ్చే   భక్తులకు తిరుమల తిరుపతి   దేవస్థానము కీలక సూచన చేసింది. భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో శ్యామలరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు మరియు ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో, వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందన్నారు.
 టిటిడి గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది. కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా, భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.
 
తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా, తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చని ఈవో తెలిపారు.

ఈవో శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీమతి గౌతమితో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొదట అన్నమయ్య భవనంలోని ఏపిటిడిసి నడుపుతున్న హోటల్‌ని, పిఎసి-2, మాధవ నిలయాన్ని పరిశీలించి, నిర్మాణంలో ఉన్న కొత్త పిఎసి -5ని కూడా తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 
0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *