Sahithee Seva

సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే

సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే

దివిటీలు పెట్టినా కానరాని
దివ్య మంగళ దీపావళి
దయనీయమై హేయమై
ధమన నీతిని కాల్చలేకపోతుంది ..
నరకాసురులు భూబకాసురులు
భువిని కాల్చుకు తింటున్నారు
కీచక కిరాతకం.. అంతులేని విరాటపర్వం
పచ్చని రంగులు పేలవంగా మారుతున్నాయి
ప్రకృతి పచ్చ చీరను సైతం లాగుతున్నారు
అచ్చం పడగ విప్పిన పడతిలా….
ఒక్కోసారి ఉన్మాదిలా
ఒక్కోసారి వర్ణశోభితంగా
ఊసరవల్లిలా రుంగులు మార్చి
ప్రకృతి సైతం వికృతమవుతుంది
కడుపు ఆకలి కాలిన బూడిదను చేస్తుంది
దిగులే దీపావళిగా మారుతుంది
తారాజువ్వలెన్నో తీక్షణంగా వెలిగి నేలకొరుగుతున్నవి
ఆది మంగళ శక్తి స్వరూపిణికి సైతం… ఆపదలా వుంది
చిలిపికృష్ణుడి చెలిగా మాత్రమే కాదు
కదన రంగమున కాలుదువ్విన సత్యభామగా
మారిన కాలం మహిళకు మహోన్నత శిఖరం
ఇక సత్యమేవ జయతే కాదు సత్యభామ జయతే
నినాదమే కావాలి నిరంతరం ||

  • మీగడ త్రినాధ రావు.

(2014 సాహితీ సేవ దీపావళి కవితల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన కవిత. రవీంద్ర భారతి లో మెమంటో అందుకోవటం ఒక మరుపురాని అనుభూతి)

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *