Sahithee Seva

ముసుగు

నానీలు – ముసుగు

1.

తెరవెనుక నిజాలు
పలికేటి ప్రగల్భాలు
నిలువునా దోపిడీలు
మేక వన్నె పులులు…

2.

గుండెనిండా బాధలు
అధరాన చిరునగవులు
కొనితెచ్చుకున్న సంతోషాలు
కానరానీయని దాపరికాలు….

3.

మంచిగా నటనలు
లోలోనతవ్వే గోతులు
తియ్యనైన‌ మాటలు
విసిరేరు వలలు…

4.

బోధించేరు నీతులు
కుక్కమూతి బుద్ధులు
దాచేసే నిజస్వరూపాలు
నయవంచన నక్కలు…

5.
నిజాయితీ వస్త్రధారణలు
వెలిసిపోయే రంగులు
కోల్పోయే అల్లుకున్నపాశాలు
కూరుకుపోయే అగాధంలో….

యామిని కోళ్ళూరు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *