Home / Sahithee Seva / రాధికా రత్నాలు

రాధికా రత్నాలు

నానీలు
రాధికా రత్నాలు

1) బద్ధకానికి
బంధువు శ్రీవారు
ఊబకాయం ఉందిగా
మాటను నిజం చేస్తూ!

2) కలలను పెళ్లాడండి
ముందు
విజయం వెంట తానుగా
కలల రాణి రాదా!

3) బాల్య చేష్టలకు
సాక్ష్యం చిన్నికృష్ణుడు
జావగారిన దేహం
ఈనాటి బాల్యం

4) వీధి మలుపులో
రామాయణం
కాలేజీ రోజుల నాటి
నా ప్రేమ పురాణం.

5) భర్తకై కాలాన్ని
శాసించే సతీసావిత్రి
భర్తనే ఏమార్చే
నేటి సావిత్రి.

  • నలిగల ‌రాధికా రత్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *