NewsSahithee Seva

జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!

జిహ్వకో రుచి!…. పుర్రె కో బుద్ధి!
– డా. పి. వి. ఎల్. సుబ్బారావు

కూటి కొరకే కోటి విద్యలు!

మనిషినిత్యావసరాలు మూడే!

కూడు, గుడ్డ,బట్ట ఉంటే చాలే!

అన్నమేరోజూ తింటూఉంటాం!

ఏ రోజు కారోజు,
కొత్తదనమే కోరుకుంటాం!

కవిత్వానికి సైతం ,
ఇంపైన భోజనమే ప్రీతి!

రుచుల తృప్తి,
కవిత్వ అభివృద్ధిలో దీప్తి!

ఆరు రుచులు ఉన్నా,
వాటిలో దేనికదే సాటి!

ఎవరి ఇష్టాన్ని బట్టి ,
వారి కదే మేటి!

రుచుల సమతుల్య దృష్టి,
తిన్నది ఇస్తుంది పుష్టి!

యుక్త ఆహార విహారాలు, ఉండాలి అని అన్నారు!

శరీరానికి యుక్తమైన,
మిత ఆహారం అవసరం!

ఆహారంతో ఆరోగ్యం,
కాపాడుకోవడమే వివేకం?

వయసును బట్టి ఆహారం స్వీకరించడం అత్యవసరం!

తీసుకున్న ఆహారం,
కారాదు ఏనాడు రోగకారకం!

తీపి శుభం బహుజన ప్రీతి!

కారం తీపికి తోడు ఈ జగతి!

చేదు ఆరోగ్యానికి సరిశృతి!

పులుపు వలపు బహుమతి!

ఉప్పే లేకుంటే పోతుంది మతి!

షడ్రుచుల సంగమం ,
ఉగాది పచ్చడి!

జీవితం షడ్రసోపేత ,
వడ్డించిన విస్తరి!

మనలోని వైశ్వానరుడే,
మనం తినే ఆహార జీర్ణకారి!

ఆరు ఋతువుల,
ఆవర్తనం నిజ ప్రకృతి!

మానవ అభిరుచుల,
సరి సుందర ఆకృతి!

  • డా. పి. వి. ఎల్. సుబ్బారావు,
    విజయనగరం.
0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *