Sahithee Seva

స్నేహ మాధుర్యం

స్నేహ మాధుర్యం

  • కమల శ్రీ

జాతి వైరం మరచి
ఆపదలో ఆపన్న హస్తం అందించి
అక్కున చేర్చుకున్న జంతురాజమా!
నీ స్నేహ మాధుర్యం మధురం! మధురాతి మధురం!
విచక్షణా జ్ఞానం కలిగి ఉండి
ఉత్తమ మేధస్సును కలిగి ఉన్న మనిషి మాత్రం
ఆపదల్లో రిక్త హస్తం చూపించి
సాటి జాతి వాడని చూడకుండా
మానవతా విలువలను మరచి
మా కన్నా మీరే నయం అనేలా ఉన్న నేటి మానవుల ప్రవర్తనా తీరు గర్హనీయం!
ఇదే సమైక్యత, స్నేహ తత్వం
మా మనుష్య జాతుల్లో ఉండి ఉంటే….
లోకం లో ఆకలి చావులు ఉండవు
అతివలపై అకృత్యాకుండవు
అంటరానితనం పాటింపులుండవు!
మీ లాగా మా మానవజాతి
మానవత్వం తో మెలిగేనా?!
స్నేహ మాధుర్యంను చవి చూసేనా!?
ఇది ప్రస్తుతం జవాబు లేని ప్రశ్న!!!.

  • డా. ఆ నాగేశ్వర రావు ( కమల శ్రీ )
    తెనాలి
0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *